నంద్యాల: జిల్లాలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల, బనగానపల్లెలో 37.1°, చాగలమర్రి 36.3°, ఆళ్లగడ్డ 35°, వెలుగోడు 34° డిగ్రీలుగా విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు కూడా వీచాయి. మార్చిలోనే 37.1°C ఉష్ణోగ్రత నమోదు గమనార్హం.