»Morning Non Veg Breakfast This Is The Best Place In Hyderabad
Non Veg breakfast: మార్నింగ్ నాన్ వెజ్ తో బ్రేక్ ఫాస్ట్..ఇదే బెస్ట్ ప్లేస్!
మీరు బ్రేక్ ఫాస్ట్(breakfast) కూడా నాన్ ఫుడ్(non veg) తింటారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఎందుకంటే ఉదయమే ఇక్కడ వేడి వేడి నాన్ వెజ్ వంటకాలు అందుబాటు ధరల్లో మనకు లభిస్తాయి. లొట్టలేసుకుంటూ తినేయచ్చు. అవెంటో ఇక్కడ చుద్దాం.
మీకు నాన్ వెజ్(non veg) అంటే చాలా ఇష్టమా. ఉదయం అల్పాహారం కూడా మాంసాహార వంటకాలతో భోజనం చేస్తారా? అయితే ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.
ఎందుకంటే హైదరాబాద్లో(hyderabad) నాన్ వెజ్ ప్రియుల కోసం బెస్ట్ మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఓ హోటల్లో గుడ్లు, కిచిడి కట్ట, బ్రెయిన్ఫ్రై, బ్రెయిన్ మసాలా, గురుద మసాలా, గురుదా ఫ్రై, పాయా, రోటీ సహా అనేక రకాల వంటకాలు ఉన్నాయి. దీంతోపాటు 9 రకాల వంటకాలతో వడ్డిస్తున్న ప్రత్యేక ఐటమ్ కేవలం రూ.250కే లభించనుంది. అంతేకాదు టెస్ట్ కూడా సూపర్ ఉంటుందని ఈ వీడియో షూట్ చేసిన యూట్యూబర్ చెబుతున్నారు.
అయితే ఈ వంటకాలు హైదరాబాద్లోని టోలిచౌకి(tolichowki) ప్రాంతంలోని ఇంపీరియల్(imperial) హోటల్లో లభిస్తాయని అతను పేర్కొన్నారు. దీంతోపాటు రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయని తెలిపాడు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా లేదా అసలు ఆ హోటల్ ఎలా ఉందో చూడాలంటే ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.