»Ap Govt Good News For Unemployed Groups Notification Coming Soon
AP Govt : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలో గ్రూప్స్ నోటిఫికేషన్
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీలోని నిరుద్యోగుల(unemployed)కు ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ (CM Jagan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని తెలిపారు. నోటిఫికేషన్ (Notification) జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని అన్నారు. దాదాపు వెయ్యికి పైగా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. వీటిలో గ్రూప్-1 పరిధిలో 100 పోస్టులు, గ్రూప్-2 పరిధిలో 900 పోస్టులకు పైగా ఉండే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సిలబస్ (Syllabus) మార్పులపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు జారీ కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతమైతే ప్రాథమికంగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిలబస్ ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై జీవో జారీ చేస్తారని తెలుస్తోంది.