దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బోయపాటి ఈ మూవీ కథపై కసరత్తులు స్టార్ట్ చేశాడట. అట్లీతో బన్నీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, వీరిద్దరి కాంబోలో గతంలో ‘సరైనోడు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.