సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో నూతనంగా ఎన్నికైన 33వ కౌన్సిలర్ కొండ వర్షిణిని పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. పద్మశాలి సంఘ అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, మొర రవి తదితరులు పాల్గొన్నారు.