అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సీతారం (37) అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. గొడవలో గాయపడటంతో ఆస్పత్రికి తరలించగా చికిత్సకు సహకరించకుండా రికార్డులు, మందులు విసిరి సిబ్బందిపై దుర్భాషలాడినట్లు స్థానికులు పేర్కొన్నారు. వెంటనే సమాచారం అందుకున్న సీఐ రఫీ, ఎస్సై నాగేశ్వరరావు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.