NDL: మద్యం మత్తులో మహిళలను వేధిస్తున్న వ్యక్తికి జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రామ్మోహన్ రెడ్డి ఇవాళ తెలిపారు. మహానంది మండలంలోని బొల్లవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మద్యం సేవించి దారిలో వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచగా రిమాండ్కు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.