WGL: పట్టణ కేంద్రంలోని CKM ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సోమవారం 15 ఏళ్లలోపు బాలికలకు HPV క్యాన్సర్ నిరోధక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ డా. లక్ష్మీదేవి ప్రారంభించారు. DMHO సాంబశివరావు మాట్లాడుతూ.. 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాలికలకు ఈ టీకా ఇస్తామని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు.