BDK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో సోమవారం అల్పకాలిక (షార్ట్ టర్మ్) కోర్సులు ప్రారంభించారు. మొత్తం 6 కోర్సులను జూన్ 13 వరకు నిర్వహిస్తామని ఐటీఐ ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. ఈ కోర్సులకు ఎలాంటి వయోపరిమితి లేదని, ఉపాధి అవకాశాలు పొందాలనుకునే వారందరూ శిక్షణ తీసుకోవచ్చని సూచించారు. నిరుద్యోగులకు ఇది సువర్ణ అవకాశమన్నారు.