ATP: రాప్తాడు నియోజకవర్గ నాయకులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు.