SRD: ఖేడ్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. వార్డులో ఓటర్లకు ఇచ్చిన మాట మేరకు సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నట్లు స్థానిక కౌన్సిలర్ స్వప్న అభిషేక్ శెట్కార్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.