TG: కరీంనగర్లోని గోపాలపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొడుకు బైక్ అడగడంతో పంట డబ్బులు వచ్చాక కొనిస్తానని తండ్రి మాటిచ్చాడు. అయితే అడిగిన వెంటనే కొనివ్వలేదని మనస్తాపానికి గురైన రిత్విక్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.