టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో బీఎల్ సంతోష్ కి ఊరట లభించింది. బీఎల్ సంతోష్ పై ఉన్న స్టే ను ఈ నెల 13 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. అప్పటి వరకు విచారణ చేపట్టరాదని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 13కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జగ్గు స్వామికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న స్టే ను కూడా హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ ఈ నెల 13 కు వాయిదా వేసింది.
కాగా.. ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణ ప్రారంభించిన సిట్, బీజేపీకి చెందిన బీఎల్ సంతోష్‌ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కోరడంతో సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సంతోష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డిసెంబర్ 5 వరకు స్టే విధించింది. స్టే గడువు ఈ రోజుతో ముగిసిపోవడంతో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డిసెంబర్ 13వరకు స్టేను పొడిగించింది.