RR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా షాద్నగర్ మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణ ముఖ్యకూడలి వరకు 5K రన్ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షాద్నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ పాల్గొన్నారు.