No forms or ID proof required to exchange Rs 2,000 notes:SBI
SBI: రూ.2 వేల నోటును (Rs 2,000 note) ఆర్బీఐ రీ కాల్ చేయడంతో గందరగోళం నెలకొంది. బ్యాంకులలో ఈ నెల 23వ తేదీ (మంగళవారం) నుంచి నోట్ల మార్పిడి చేసుకోవచ్చు. దీంతో గందరగోళం నెలకొంది. ఆర్బీఐ స్పష్టంగా చెప్పినప్పటికీ.. బ్యాంకులకు వెళ్లి డిపాజిట్ చేయాలా..? ఫామ్స్ ఏమైనా నింపాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది.
నోట్ల మార్పిడి కోసం ప్రజలు ఎలాంటి గుర్తింపు పత్రం తీసుకురావాల్సిన అవసరం లేదని ఎస్బీఐ (SBI) పేర్కొంది. అలాగే రసీదు కూడా చూపించాల్సిన అవసరం లేదని వివరించింది. రిక్వెస్ట్ ఫామ్ నింపాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
రూ.2 వేల నోటు (Rs 2,000 note) మార్పిడికి సంబంధించి ఫామ్ తీసుకొని.. ఆధార్ కార్డ్ సమర్పించాలని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవీ నిజమేనా అని జనం గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ఎస్బీఐ స్పందించింది. ఏమీ అవసరం లేదని స్పష్టంచేసింది. ఓకేసారి రూ.2 వేల నోట్లు.. పది మార్చుకోవచ్చని తెలిపింది. అన్నీ బ్యాంకులు.. ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో కూడా మార్చుకునే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.