HNK: హనుమకొండలో ఇవాళ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డిని మామునూరు మండల సాధన సమితి నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. మామునూరును మండల కేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఛైర్మన్0ను వారు కోరారు. త్యాగాలకు మారుపేరైన మామునూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ తెలిపారు.