ఖమ్మం జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన సంత్ సేవాలాల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో పంచాయతీరాజ్ జట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్పై ఘనవిజయం సాధించింది. విజేతలకు జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, కూరపాటి ప్రదీప్ బహుమతులు అందజేశారు.