»Road Accidents At Hyderabad Suburb High In Last Year
Road Accidents: హైదరాబాద్ శివార్లలో ప్రయాణమా.. జర జాగ్రత్త సుమి..?
హైదరాబాద్ శివార్లలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఏడాది 7559 ప్రమాదాలు జరగగా.. సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లా పరిధిలో 28 శాతం మరణాలు సంభవించాయి.
Road Accidents At Hyderabad Suburb High In Last Year
Road Accidents: హైదరాబాద్ (Hyderabad) శివార్లలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిటీ విస్తరణ, రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న ప్రమాదాలు ఏ మాత్రం తగ్గడం లేదు. యాక్సిడెంట్‌కు ప్రధాన కారణాలు సిటీకి ఎక్కువ జనం రావడం.. శివారు ప్రాంతాల్లో విద్యాసంస్థలు (colleges), కంపెనీలు (comapanies) ఉన్నాయి. ఆ చోటు విద్యార్థులు, పేరంట్స్, వ్యాపారులు, ఉద్యోగులు వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ పెరుగుతోంది. అప్పుడప్పుడు ఆ రూట్లో ఏ వాహనం లేదని స్పీడ్‌గా రావడం ప్రమాదానికి కారణం అవుతుంది.
హైవే మీద స్పీడ్ గన్స్ (speed guns) ఉంటాయి. సిటీ శివారులో.. నగరం ఎంట్రీ అయ్యాక ఉండవు. స్పీడ్ గన్ ఉంటే 80 కిలోమీటర్ల వేగం కన్నా ఎక్కువ వెళ్తే జరిమానా విధిస్తారు. దీంతో వాహనం నడిపే డ్రైవర్‌కు భయం ఉంటుంది. శివారు ప్రాంతాల్లో ఉండకపోవడంతో స్పీడ్ పెరుగుతోంది. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి.
లారీలు (lorry), భారీ వాహనాలు మధ్యాహ్నం సిటీలోకి అనుమతి లేదు. ఉదయం నుంచి సాయంత్రం లోపు వచ్చే వాహనాలు శివారు ప్రాంతాల్లో ఉంటాయి. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్లాలనే తపనతో వేగంగా వెళ్లడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
గత ఏడాది హైదరాబాద్, శివారులో 7559 ప్రమాదాలు జరగగా.. 44 శాతం సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరిగాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో 12 శాతం కాగా.. సైబరాబాద్, రాచకొండ పరిధిలో 16 శాతం చొప్పున జరిగాయి. సైబరాబాద్ కమిషనరేట్‌లో 12 శాతం, రాచకొండలో 10 శాతం, సంగారెడ్డి జిల్లా పరిధిలో 6 శాతం మరణాలు జరిగాయి. మొత్తం మరణాల్లో 28 శాతం ఈ ప్రాంతంలో జరిగాయి. ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వేగంగా ప్రయాణిస్తోన్న వాహనాలను గుర్తించి.. జరిమానా విధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సో.. ఊరెళ్లి వచ్చేప్పుడు అయినా.. ఊరు వెళ్లాల్సిన సమయంలో అయిన కనీసం గంట ముందు బయలుదేరాలని పోలీసులు సూచిస్తున్నారు. అతి వేగం వద్దు ప్రాణం ముద్దు అని స్లోగన్స్ ఇస్తున్నారు.