TG:: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రదీప్, విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జె.ఆర్.ప్రదీప్ నుంచి హాష్ ఆయిల్‌ను విజయ్ కుమార్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 367 గ్రాముల హాష్ ఆయిల్, బైక్, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.