NLR: నెల్లూరు వెంగమాంబ రెస్టారెంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫిర్యాదులు, పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ కంప్యూటర్ డేటాను పరిశీలించారు. డిజిటల్ పేమెంట్స్కు చెల్లించిన పన్నుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.