TPT: యర్రావారిపాళెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఈ మరణాలకు కారణమైంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.