JGL: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల ఆర్టీసీ డిపోలో మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిపో మేనేజర్ కే. కల్పన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో MF కవిత, సూపరింటెండెంట్ జగదీశ్వరి సహా సుమారు 50 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.