AP: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో డయేరియా కలకలం రేగింది. 25 మంది హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అందరికీ ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స కొనసాగుతోంది. డయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. నీరు ఎక్కడ కలుషితమైందో తెలుసుకునేందుకు 40 చోట్ల శాంపిల్స్ తీసుకున్నారు.