RR: జనప్రియ నగర్ ఫేస్-1 అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర అనన్యం అని కొనియాడారు.