ఊహించని విధంగా ‘అన్ స్టాపపబుల్ షో’తో హోస్ట్‌గా దుమ్ములేపారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇండియాలోనే బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న’అన్ స్టాపపబుల్’.. సీజన్ 1 ని ముగించుకోని.. ఇటీవలె సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సీజన్లో బాలయ్య ఫన్ డోస్ మరింత పెంచాడు. అయితే ఈ సారి స్టార్ హీరోల సందడి కాస్త తగ్గింది. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ.. అడివి శేష్, శర్వానంద్ లాంటి యంగ్ హీరోలతో రచ్చ చేశారు బాలయ్య. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు.. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంటర్టైన్ చేశారు బాలయ్య. ఈ వారం రాఘవేంద్రరావు, సురేష్ బాబు, అల్లు అరవింద్, కోదండరామి రెడ్డి లాంటి లెజెండ్స్‌తో సందడి చేశారు. ఇక ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా టీమ్ ప్రభాస్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభాస్ గ్యాప్ లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. దాంతో అన్‌స్టాపబుల్2కి ఎప్పుడొస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.. కానీ రావడం పక్కా అంటున్నారు. ఇక డార్లింగ్ ఈ షోకు వస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పొచ్చు. మామూలుగానే బాలయ్య, ప్రభాస్ ఎంతో సరదాగా ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు కలిస్తే ఎంటర్టైన్మెంట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. ఇకపోతే.. అన్‌స్టాపబుల్ 2లో చిరంజీవితో పాటు.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సెకండ్ సీజన్‌ను చిరుతో మొదలు పెడుతున్నారని వినిపించింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. మరి చిరు, ప్రభాస్, తారక్.. బాలయ్యతో ఎప్పుడు సందడి చేస్తారో చూడాలి.