»Police Impose Fine On Riders Not Wearing Helmet While Offering Lift To Amitabh Anushka
Amitabh-Anushka:అమితాబ్-అనుష్కకు లిప్ట్ ఇచ్చిన బైకర్లకు ఫైన్
ముంబై ట్రాఫిక్‌లో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్- అనుష్క శర్మకు ఇద్దరు బైకర్లు లిప్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.
Police Impose Fine On Riders Not Wearing Helmet While Offering Lift To Amitabh-Anushka
Amitabh-Anushka:మహానగరం ముంబైలో ట్రాఫిక్ చిక్కులు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల తిప్పలు మాములుగా ఉండవు. సెలబ్రిటీలకు కూడా తప్పవు.. అయితే ఇటీవల బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh).. స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు (Anushka) బైకర్లు లిప్ట్ ఇచ్చారు. ఆ ఇన్సిడెంట్ వైరల్ కాగా.. తాజాగా ముంబై పోలీసులు లిప్ట్ ఇచ్చిన ఇద్దరికీ ఫైన్ వేశారు.
లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు బైకర్స్ హెల్మెట్ ధరించలేదు. అందుకే ఫైన్ ముంబై ట్రాఫిక్ పోలీసులు (police) ఫైన్ చేశారు. ముంబై వీధుల్లో అమితాబ్ కారు ట్రాఫిక్‌కు ఆగింది. అంతలో ఒకతను వచ్చి లిప్ట్ ఇచ్చాడు. సమయానికి అమితాబ్‌ను (Amitabh) షూటింగ్ వద్ద దింపేశాడు. దీంతో అమితాబ్ (Amitabh) అతనికి థాంక్స్ చెప్పడమే కాక.. ఫోటో పోస్ట్ చేశాడు.
అంతకుముందు కారులో స్టూడియోకు వెళ్తుంటే చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓ వ్యక్తి బైక్ మీద స్టూడియో వద్ద దింపాడు. ఇలా ఇద్దరు సెలబ్రిటీలను డ్రాప్ చేశారు. చాలా మంది ప్రశంసించగా.. మరికొందరు హెల్మెట్ ఏదని అడిగారు. ముంబై పోలీసుల (mumbai police) దృష్టికి తీసుకెళ్లగా.. ట్రాఫిక్ విభాగానికి ఫార్వార్డ్ చేశారు. బైకర్లకు ఫైన్ వేశారు. ఆ ఫైన్ ట్విట్టర్ వేదిక షేర్ చేశారు. అనుష్కకు లిప్ట్ ఇచ్చిన వ్యక్తికి రూ.10.500 ఫైన్ పడగా.. అమితాబ్‌కు ఇచ్చిన వ్యక్తికి పడిన జరిమానా గురించి అందులో కనిపించడం లేదు.
The Mumbai Police have imposed fine on riders of two motorcycles for not wearing helmet while offering lift to Bollywood actors #AmitabhBachchan and #AnushkaSharma on the city roads, an official said on Wednesday. https://t.co/t0zzmAvDet