»Heavy Sunlight Temperature In Telugu States Beware Of Heart And Kidney Patients
Alert: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు…ఈ వ్యాధిగ్రస్తులు జాగ్రత్త!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కోడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల వ్యాధి గ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు(doctors) చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే వెదర్ రిపోర్ట్ సైతం సూచనలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(heavy sunlight)మండిపోతున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా ఎండలు తీవ్ర స్థాయిలో దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలు, వేడి గాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. మొన్నటి వరకు 40 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 49 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇంట్లో ఉన్నా, ఆ వేడి ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. ఇక బయటకు వెళ్లిన వారి పరిస్థితి గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న తరుణంలో గుండె(heart), మూత్రపిండాల(kidney)సమస్యలతో బాధపడుతున్న రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ, గుండె సంబంధిత రోగులు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని వైద్యులు సూచించారు. వీలైనంత వరకు తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవాలని చెప్పారు. సీనియర్ సిటిజన్లు, షుగర్ వ్యాధిగ్రస్తులతో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు బయటకు రావొద్దని వైద్యులు(doctors) హెచ్చరించారు.
ఈ క్రమంలో వేడి కారణంగా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు(experts) హెచ్చరిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, చల్లటి ప్రదేశాల్లో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కలుషితమైన ఆహారం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ ఎండల సమయంలో కచ్చితంగా తెలుపు(white) రంగు దస్తులు, కాటన్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావద్దని అంటున్నారు. శరీర ఉష్ణోగ్రతలలను అదుపులో ఉంచుకోవాలని కోరుతున్నారు. రు పుష్కలంలగా తీసుకోవాలని, వడదెబ్బ తగిలినవారు వెంటనే ఓఆర్ఎస్ తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు.