film studio : శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ స్టూడియో నిర్మించనున్న ఎన్టీఆర్ !
తాజాగా ఎన్టీఆర్ కూడా కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నాడట. కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి ఎన్టీఆర్ ఓ ఫిల్మ్ స్టూడియోలో పెట్టుబడులు పెడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. ఎన్టీఆర్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్ దగ్గర కొంత మంది స్నేహితులతో కలిసి స్థలం కొని అందులో ఐదు అంతస్థులున్న స్టూడియోను నిర్మించారని వార్తలు వచ్చాయి
ప్రముఖ టాలీవుడ్ హీరో (Tollywood hero) ఎన్టీఆర్ ఇక వ్యాపార రంగంలోకి దృష్టి పెడుతున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. స్టార్ హీరోలంతా ఒక వైపున మూవీస్ చేస్తూనే .. మరో వైపున ఇతర బిజినెస్ లతో బిజీగా ఉన్నారు.కొంతమంది హీరోలు సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటే .. మరికొంతమంది రెస్టారెంట్లు వంటి బిజినెస్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్( NTR)తన స్నేహితులతో కలిసి ఓ స్టూడియో నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శంషాబాద్ (Shamshabad) సమీపంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ పనులు మొదలు పెడుతున్నారని అంటున్నారు. ఈ స్టూడియోలో సెట్స్ వేసుకుని షూటింగ్స్ చేసుకోవచ్చు. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్రేన్లు .. కెమెరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగులకు వాటిని రెంట్ కి ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
ఇంతకు ఎన్టీఆర్ తో పాటు సదరు స్టూడియోలో ఇన్వెస్ట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరు అని ఆరా తీయగా.. ఒకరేమో వివేక్ కూచిబొట్ల(Vivek Kuchibotla), మరొకరేమో నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal), ఇంకొకరు తాహిర్ టెక్నిక్స్ స్టూడియో.. ఈ తాహిర్ స్టూడియో సినిమా షూటింగులకు అవసరమైన కెమెరాలు, క్రేన్స్ వంటి వాటిని లీజుకు ఇస్తూ ఉంటారు. ఇది ఇన్సైడ్ వస్తున్న సమాచారం. ఇందులో ఏమాత్రం నిజం లేదని స్టూడియో నిర్మాణంలో ఎన్టీఆర్ పెట్టుబడులు పెట్టలేదని కళ్యాణ్ రామ్(Kalyan Ram) నిర్మాణ సంస్థలో మాత్రమే పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.ఎవరో కావాలని ఎన్టీఆర్ పేరును వాడేస్తున్నారు అని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం క్రేజ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఇప్పుడు కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా నటిస్తోంది.