TPT: సూళ్లూరుపేటల సమీపంలోని హోలీ క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మన్నేమత్తూరు పంచాయతీ గంపలకండ్రిగ గ్రామానికి చెందిన పల్లికొండ పుల్లయ్య హైవేపై నడిచి వెళ్తుండగా.. నాయుడుపేట వైపు వెళ్లే బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.