CTR: కార్వేటినగరం ఎంపీడీవో కార్యాలయాన్ని గురువారం జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు మండల అభివృద్ధి పనులు, సర్వసభ్య సమావేశాలలో చేసిన తీర్మానాలు గురించి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.