GNTR: తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం ఉదయం 11:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరగనున్నట్లు ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. ఆమె వివరాల ప్రకారం.. ఈ సమావేశంలో అజెండాలోని 21 అభివృద్ధి అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతారు. అభివృద్ధి పనుల కోసం జరిగే ఈ భేటీకి కౌన్సిల్ సభ్యులందరూ హాజరు కావాలని ఇవాళ ఒక ప్రకటనలో కోరారు.