CTR: వెదురు కుప్పం ఎంపీడీవో కార్యాలయాన్ని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమీక్షించారు. వారికి సూచనలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.