సత్యసాయి: రొద్దం మండలం రోప్పాల గ్రామంలో నిర్వహించిన శ్రీ వాల్మీకి విగ్రహ ఆవిష్కరణలో హిందూపురం ఎంపీ బీ.కే పార్థసారథి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాల్మీకి విగ్రహానికి ఎంపీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు