TG: తుఫాన్ నష్టంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ చర్యలకు SDRF బృందాలను వాడుకోవాలని సూచించారు. సీఎం ముందస్తు అలర్ట్ కారణంగానే ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. మరో 24 గంటలు కలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నష్టాన్ని తగ్గించగలిగామని ఆయన తెలిపారు.