NGKL: కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదర్శనకు నాగర్ కర్నూల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. నవంబర్ 3న బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 4వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటుంది. మరుసటి రోజు గిరి ప్రదర్శన దర్శనం చేసుకుంటుంది. వివరాలకు 9490411590, 9490411591 నెంబర్లను సంప్రదించాలన్నారు.