గాంధీ హాస్పిటల్ (Gandhi Hospital) లో డెడ్ బాడీ వదిలేసి వెళ్లిన కేసును పోలీసుల ఛేదించారు. మృతుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన జితేందర్ గా గుర్తించారు. నగదు లావాదేవిల విషయంలో గచ్చిబౌలిలో జితేందర్ పై ఐదుగురు దాడి చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు (Hyderabad)లోని గాంధీ హాస్పిటల్ లో ఈ నెల 9వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది. దీని మీద సమాచారం అందడంతో పోలీసులు (Police)కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. దాదాపు 200కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన తర్వాత ఆ మృతదేహం జితేందర్ (Jitender) అనే వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. డబ్బుల విషయంలో ఓ వ్యక్తితో జరిగిన గొడవలో అతడిని కొట్టి చంపినట్లుగా.. ఆ తర్వాత మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ (Gandhi Hospital) కి తీసుకువచ్చి వదిలేసి వెళ్లినట్టుగా గుర్తించారు. దీంతో ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. చిలకలగూడ (Chilakalguda) పోలీసులు తెలిపిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి.
మే 9వ తేదీ అర్ధరాత్రి 1.40 గం.లకు మిగతాజీవిగా ఉన్న ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు స్ట్రెచర్ మీద తీసుకువచ్చారు.గచ్చిబౌలి (Gachibowli)లో జితేందర్ అనే వ్యక్తి మీద ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించినట్లుగా సీసీటీవీ ఫుటేజీ రికార్డులను బట్టి అంచనాకు వచ్చారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లుగా నిందితుడు గమనించడంతో గాంధీ హాస్పిటల్ నుంచి పరారయ్యాడు. హాస్పిటల్ కి వచ్చిన ఆటోడ్రైవర్ కి గూగుల్ పే (Google pay) తో డబ్బులు ఇచ్చాడు. ఈ నెంబరు ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. నిందితులను గుర్తించారు. తపన్ అనే వ్యక్తి జితేందర్ తో డబ్బుల విషయంలోనే గొడవపడి, కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆటో(Auto) లో గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చిన దృష్యాలు సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. సదరు ఆటో డ్రైవర్ కు నిందితుల్లో ఒకరు గూగుల్ పే చేయగా.. దీని ఆధారంగా హంతకులను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.