MNCL: మహిళలు అభివృద్ధి పథంలో పయనించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులను, అధికారులను ఆయన ఘనంగా సన్మానించారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.