Sharwanand: శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్.. ఇదే క్లారిటీ!
ప్రభాస్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన యంగ్ హీరో శర్వానంద్.. ప్రభాస్ కంటే ముందే పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అయిపోయాడు. కొన్ని నెలల కిందటే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ ఈ మధ్య శర్వానంద్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం సినిమాల పరంగా రేసులో వెనకబడిపోయాడు శర్వానంద్(Sharwanand). చివరగా చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు అంతగా అలరించలేకపోయాయి. దాంతో ఎలాగైనా సరే సాలిడ్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఒక ఇంట్రెస్టింగ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ లోపే శర్వానంద్ పెళ్లి ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు పెళ్లి ఊసే లేకపోవడంతో.. ఎంగేజ్మెంట్ కాన్సిల్ అయిందనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. పోయిన జనవరి నెలలో శర్వానంద్‌కు రక్షితా రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు శర్వానంద్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సతీసమేతంగా అటెండ్ అయ్యారు.
ఇక ఎలాగు ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి.. సమ్మర్లో పెళ్లి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు సమ్మర్ కూడా దగ్గరపడింది. కానీ శర్వా పెళ్లి సౌండ్ వినిపించడం లేదు. దీంతో శర్వానంద్, రక్షితల పెళ్లి క్యాన్సిల్ అయినట్లు టాక్ రాగా.. దీనిపై శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
శర్వానంద్ పెళ్లి విషయంలో జరుగుతున్నదంతా ప్రచారమే.. అందులో అస్సలు నిజం లేదని.. శర్వా, రక్షిత ఇద్దరు సంతోషంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే శర్వానంద్ పెద్దలు నిర్ణయించిన తేదికీ శర్వానంద్ పెళ్లి ఉంటుందని అంటున్నారు.