SDPT: అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండా నర్సరీలో ఎండ తీవ్రత నుండి మొక్కలను రక్షించేందుకు సర్పంచ్ సునీత రాజు నాయక్ ప్రత్యేక చొరవతో గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఎండిపోయే ఆస్కారం ఉంటుందన్నారు. మ్యాట్ వల్ల ఎండతాకిడికి తట్టుకొని తగిన ఉష్ణోగ్రత అందేవిధంగా ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా సంరక్షిస్తున్నామన్నారు.