AP: అమరావతిలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మరో 5 పథకాలను ప్రకటించనున్నారు. చంద్రబాబు సమక్షంలో 36 ఎంవోయూలపై అధికారులు సంతకాలు చేయనున్నారు. డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్వయం బ్రాండ్ పేరు, లోగోను సీఎం ఆవిష్కరించనున్నారు.