BHNG: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజన్ నుంచి పొగలు వ్యాపించాయి. ఒక్కసారిగా పొగ రావడంతో భయంతో ప్రయాణికులు బస్సులో నుంచి దిగారు.హైవే పై గంట పాటు నిరీక్షించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి కావేరి ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. బస్సులో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.