GDWL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాజయ్య మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ మహిళా కార్మికులను శాలువాతో సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు కొనసాగుతున్నారన్నారు. పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు మున్సిపల్ మహిళా కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.