TG: హైదరాబాద్‌ను పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYDలోని డీజిల్ బస్సులను 2026 డిసెంబరులోపు జిల్లాలకు తరలిస్తామని.. 100 శాతం ఈవీ బస్సులను తెస్తున్నామని తెలిపారు. ఈవీ వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్ విధిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నామని రేవంత్ వెల్లడించారు.