JGL: బుగ్గారం జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి విద్యార్థులకు నియోజకవర్గ స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సిరికొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కుమ్మరి దీక్షిత 1 స్థానం సాధించి రూ.2,000 బహుమతి, కుమ్మరిపల్లి కేజీబీవీకి చెందిన మేఘన 2 స్థానం సాధించి రూ.1,000 అందుకుంది. మల్లన్నపేట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని సంజన 3స్థానం సాధించి రూ.500 బహుమతి పొందింది.