తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy)కి నారా లోకేష్ నివాళులు అర్పించారు.
వైఎస్సార్‌కు నివాళి అర్పించిన నారా లోకేష్ వీడియో:
నంద్యాల జిల్లా…
శ్రీశైలం నియోజకవర్గం…
నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokeshpic.twitter.com/hASrnfV3Jl
ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరులో నేడు నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) సాగుతోంది. ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువ వద్ద డాక్టర్ వైఎస్ఆర్(YSR) స్మృతి వనం మీదుగా పాదయాత్ర సాగింది. ఆ మార్గం గుండా వెళ్తున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు వైఎస్సార్ స్మృతి వనం గురించి నారా లోకేష్‌కు తెలిపారు.
వైఎస్సార్(YSR) స్మృతి వనాన్ని చూసిన నారా లోకేష్(Nara Lokesh) వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు కదులుతూ ప్రజలకు అభివాదం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.