ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో త్వరలో రాతి నిర్మాణం కాబోతున్న గర్భాలయం,విమాన గోపురం, ముఖ మండపం, రాతి వర్గములను ఆదివారం రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, ఆలయ ఈవో విజయ రాజు కలిసి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, దేవాదాయ శాఖ కర్నూల్ స్థపతి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.