కోనసీమ: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వం మహిళలకు అద్భుతమైన అవకాశం కల్పించింది. యానాం బీచ్ రోడ్లోని బోట్ హౌస్లో PTDC ఆధ్వర్యంలో మహిళా సందర్శకులందరికీ ఉచిత బోట్ రైడ్లను అందించనున్నారు. పర్యాటకులు, స్థానిక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా గడపాలని అధికారులు కోరారు.