PDPL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఎన్టీపీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. జేఏసీ నాయకులు లక్ష్మారెడ్డి, చిలుక శంకర్, భూమయ్య మాట్లాడుతూ.. ఈ చట్టాల వల్ల కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని, పని గంటలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని రద్దు చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.