»56th Ipl Match Rr Amazing Win Over Kkr Jaiswal And Chahal New Records
IPL 2023: KKRపై RR అద్భుత విజయం..జైస్వాల్, చాహల్ సరికొత్త రికార్డు
ఐపీఎల్ 2023(ipl 2023)లో నిన్న జరిగిన 56వ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు..కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) టీంపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. చాహల్ 4/25, జైస్వాల్ అజేయంగా 98 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ గెలుపునకు తోడ్పాటునిచ్చారు.
యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) 98 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ (RR) టీం.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో ఆరు ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే గెలిచేశారు. జోస్ బట్లర్ డకౌట్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడారు. ఆ క్రమంలో RR కెప్టెన్ సంజు శాంసన్ కూడా 48 పరుగులు చేసి అద్బుతంగా ఆడారు. కానీ జైస్వాల్ తన సెంచరీని మిస్ అయ్యారు.
అయితే జైస్వాల్ కేవలం 13 బంతుల్లో ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఈ ఘనత పట్ల స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ట్విట్ చేస్తూ ప్రశంసించారు.
ఇక శాంసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయమని కోరడంతో KKR జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 57, నితీష్ రాణా 22 పరుగులు మినహా ఏ ఒక్కరూ కూడా పెద్దగా రన్స్ చేయలేదు. మరోవైపు RR బౌలర్లు కోల్‌కతా జట్టును భారీగా రన్స్ చేయకుండా కట్టడి చేశారు. ఆ నేపథ్యంలో యుజ్వేంద్ర చాహల్(yuzvendra chahal) 4/25, బౌల్ట్ 2/15, సందీప్ శర్మ, ఆసీఫ్ చెరో వికెట్ పడగొట్టి అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు.
దీంతో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి ఈ IPL 2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మొదటిసారిగా పర్పుల్ క్యాప్‌ని పొందేందుకు సిద్ధంగా ఉన్నాడు.