సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవం సందర్భంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని సీఐ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రేపు జరిగే తేరు ఉత్సవానికి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మహిళలు బంగారు ఆభరణాలు ధరించి గుంపుల్లోకి రావద్దని, విలువైన వస్తువులు వెంట ఉంచుకోవద్దని సూచించారు.